దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో రోజుకు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ పోలీస్ శాఖలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కరోనా సోకడం, ఆ తర్వాత ఆయన చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
భరత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న 31 ఏళ్ల కానిస్టేబుల్‌కి ఎప్పుడో కరోనా సోకింది, అయితే ఆయనకు కరోనా లక్షణాలేవి కనపడలేదు. సోమవారం వరకూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, అయితే హఠాత్తుగా మంళవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై వైద్య సేవలు అందించారు.
అనుమానం వచ్చి సదరు కానిస్టేబుల్ శాంపిల్స్‌ను కరోనా పరీక్షలకు పంపగా పాజిటివ్ అని తేలింది. ఇది ఢిల్లీ పోలీస్ శాఖలో నమోదైన తొలి కరోనా మరణం. చనిపోయిన కానిస్టేబుల్‌కు ఓ భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. కానిస్టేబుల్‌తో కాంటాక్టులో ఉన్న వారందరినీ క్వారంటైన్‌కి పంపారు.
కాగా.. కానిస్టేబుల్ మృతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాకుండా చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాని కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.