ప్రముఖ సెలబ్రిటీ రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ షాపు నుండి మెడిసిన్ కొనుగోలు చేస్తూ బయటకు వస్తుండగా ఓ వ్యక్తి తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. లాక్డౌన్లో రకుల్ ఆల్కహాల్ కొనుగోలు చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారమైంది. కాగా.. ఈ వీడియోపై రకుల్ ఘాటుగా స్పందించింది.
ట్విట్టర్లో కెఆర్కె బాక్సాఫీస్ అనే అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్‌కు రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ‘ఓ వావ్..! మెడికల్ స్టోర్లలో ఆల్కహాల్ అమ్ముతారని నాకు తెలియదే’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.
రకుల్ ప్రీత్ సింగ్ లిక్కర్ కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిందంటూ నెటిజెన్లు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి రకుల్ ప్రీత్ వెళ్లిన షాపు లిక్కర్ షాపు కాదు, అదొక మెడికల్ షాపు. ప్రస్తుతం రకుల్ ఫ్యామిలీ ముంబైలో ఉంటోంది. ముంబైలోని బాంద్రాలో ఓ మెడికల్ షాప్ వద్ద రకుల్ ప్రీత్ సింగ్ మందులు కొనుక్కొని బయటకు వస్తుండగా ఎవరో వీడియోని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
Oh wow ! I wasn’t aware that medical stores were selling alcohol 🤔😂😂 https://t.co/3PLYDvtKr0
— Rakul Singh (@Rakulpreet) May 7, 2020