అసలే కరోనాతో కష్ట కాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మరో ఘోరమైన ప్రమాదం జరిగింది. విశాఖపట్నం సమీపంలోని ఆర్.ఆర్.వెంకటాపురం వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి పెద్దమొత్తంలో ప్రమాదకర విష వాయువు లీక్ అయ్యింది. ఈ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య పదికి పెరిగింది. సుమారు 200 మందిని ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఈ విష వాయువు పీల్చిన వారికి కళ్లు మండిపోవటం, కడుపులో నొప్పి, వాంతులు, తల తిప్పడం, శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడం, ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లటం వంటిది జరిగింది. ఇలా రోడ్డుపై అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన అనేక మందిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఫ్యాక్టరీకి చుట్టప్రక్కల ఉన్న ఐదు ఊర్లను అధికారులు ఖాలీ చేయించారు.