నాన్న మీ కొత్త జీవితం బాగుండాలి: దిల్ రాజు కుమార్తె

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆదివారం నాడు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే. తండ్రి రెండో పెళ్లికి కుమార్తె హన్షితా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘మీరు ఎల్లప్పుడూ నాకు బలంగా ఉన్నారు. నన్ను సంరక్షించినందుకు, నిరంతరం కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరు సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి రోజు మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా.. మీ హన్షు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

dil-raju

మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసినదే. అనితకు, దిల్ రాజుకు పుట్టిన కూతురే హన్షితా. భార్య మరణం తర్వాత ఇన్నాళ్లు ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు, ఆదివారం ఉదయం ఓ ప్రకటన చేశారు. ఆరోజు నుండి ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం తేజస్విని అనే బ్రాహ్మణ యువతిని తన స్వంత గ్రామంలో అతికొద్ది బందువుల సమక్షమంలో వివాహమాడారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s