ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ అదనపు జేసీల నియామకం కోసం భారీగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), రెవెన్యూ శాఖల పర్యవేక్షణ, వార్డు వాలంటీర్లు, గ్రామ మరియు వార్డు సచివాలయాల పర్యవేక్షణకు ఒక్కో జాయింట్ కలెక్టర్ చొప్పున నియామకం చేసింది. రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు సంబంధించి అదనపు జాయింట్ కలెక్టర్‌ను కూడా ఏపీ సర్కారు నిమామకం చేసింది.
జిల్లాల వారీగా అధికారుల బదిలీ వివరాలు ఇలా ఉన్నాయి:
* నెల్లూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా వి.వినోద్‌కుమార్
* నెల్లూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎన్. ప్రభాకర్‌రెడ్డి
* శ్రీకాకుళం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా సుమిత్‌కుమార్
* శ్రీకాకుళం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కె.శ్రీనివాసులు
* విజయనగరం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి. క్రిస్ట్ కిషోర్‌కుమార్
* విజయనగరం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా మహేష్ కుమార్ రావిరాల
* విశాఖపట్నం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.వేణుగోపాల్‌రెడ్డి
* విశాఖపట్నం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి. అరుణ్‌బాబు
* తూర్పు గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జి.లక్ష్మీషా
* తూర్పు గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా కీర్తి చేకూరి
* పశ్చిమ గోదావరి రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.వెంకటరమణారెడ్డి
* పశ్చిమ గోదావరి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా హిమాన్షు శుక్లా
* కృష్ణా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా కె.మాధవీలత
* కృష్ణా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా శివశంకర్ లోతేటి
* గుంటూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఏఎస్ దినేష్‌కుమార్
* గుంటూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా పి.ప్రశాంతి
* ప్రకాశం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా జె.వెంకటమురళీ
* ప్రకాశం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా టీఎస్ చేతన్
* చిత్తూరు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా డి. మార్కండేయులు
* చిత్తూరు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా వీరబ్రహ్మయ్య
* వైఎస్సార్ జిల్లా రైతు భరోసా, రెవెన్యూ జేసీగా ఎం.గౌతమి
* వైఎస్సార్ జిల్లా గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా సాయికాంత్ వర్మ
* అనంతపురం రైతు భరోసా, రెవెన్యూ జేసీగా నిషాంత్‌కుమార్
* అనంతపురం గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా లావణ్య వేణి
* కర్నూలు రైతు భరోసా, రెవెన్యూ జేసీగా రవిసుభాష్
* కర్నూలు గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా ఎస్.రామసుందర్‌రెడ్డి