జపాన్‌కు చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ కంపెనీ కవాసకి భారత మార్కెట్లో విక్రయిస్తున్న నింజా సిరీస్‌లో సరికొత్త వేరియంట్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన సరికొత్త 2020 వెర్షన్ నింజా 650 మోటార్‌సైకిల్‌ను కవాసకి విడుదల చేసింది.
భారత మార్కెట్లో 2020 కవాసకి నింజా 650 బైక్ ప్రారంభ ధర రూ.6.24లక్షలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న 2019 మోడల్ నింజా 650 ధరతో పోల్చుకుంటే కొత్త 2020 నింజా 650 ధర రూ.35,000 అధికం.
కవాసకి నింజా 650 బైక్‌లో ఉపయోగించిన 649సీసీ పారలల్ ట్విన్ ఇంజిన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి మరింత శక్తివంతమంతగా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీని కూడా జత చేశామని, ఆసక్తి ఉన్న వారు కవాసకీ వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.