తమిళనాడులో కరోనా మహమ్మారి దావానళంలా వ్యాపిస్తోంది. మాస్కులు ధరించక పోవటం, సామాజిక దూరం పాటించకపోవటం, కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన ఆ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో గురువారం సాయంత్రానికి కొత్తగా 447 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా.. గురువారం నాడు కరోనా వైరస్‌తో ఇద్దరు చనిపోయారు. కొత్త కేసులతో కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,664కు చేరుకోగా, ఇప్పటి వరకూ మొత్తం 66 మంది చనిపోయారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్నా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గడం లేదు.