ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ హిట్ రామ్ నటిస్తున్న చిత్రం రెడ్ (RED). క్రైమ్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని మాస్ అండ్ క్లాస్ లుక్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాడు. కాగా.. రేపు (మే 15) రామ్ పుట్టినరోజు సందర్భంగా తన తాజా చిత్రం ‘రెడ్’లోని ‘డించక్’ అనే మాస్ సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ పాట విడుదల కానుంది. రెడ్ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, దీనిని స్రవంతి రవికిషోర్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్లో విడుదల కావల్సిన రెడ్ చిత్రం లాక్డౌన్ వలన ఆలస్యమైంది.