సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఓ కొత్త సినిమా తీసేశాడు. గతంలో మియా మాల్కోవాతో ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ జిఎస్టి అనే షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్‌లో విడుదల చేసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ, ఇప్పుడు అదే హీరోయిన్‌తో క్లైమాక్స్ (Climax) పేరిట మరో కొత్త ఫిలిం తీశాడు.
ఇందుకు సంబంధించిన ఆర్జీవీ ఓ టీజర్ వీడియోని కూడా యూట్యూబ్‌లో విడుదల చేశాడు. మియా మాల్కోవా ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం ‘క్లైమాక్స్’ మూవీ టీజర్‌ని గురువారం సాయంత్రం వర్మ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ట్రైలర్‌ని మే 18న ఉదయం 9.30కి విడుదల చేయనున్నట్టు వర్మ తెలిపారు. ఇదొక థ్రిల్లర్ సినిమా అని చెబుతున్నాడు ఆర్జీవీ. మరి ఇందులో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఎక్కువుందో లేక ఆర్జీవీ మార్క్ శృంగార ఫ్యాక్టర్ ఎక్కువుందో సినిమా విడుదలయ్యాకే తెలియాలి.