ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం రెడ్. ఇందులో రామ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. వీరిద్దరూ అన్నదమ్ములు, ఓ క్రైమ్ సీన్ నుంచి ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఎలా శిక్ష నుంచి తప్పించుకున్నారనే స్టోరీతో వస్తున్నదే ఈ రెడ్ సినిమా. తమిళంలో హిట్ అయిన ‘తడమ్’ సినిమాను తెలుగులో రెడ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, స్రవంతి రవికిషోర్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఏప్రిల్‌లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్డౌన్ వలన వాయిదా పడింది. ఒకవేళ మీరు ఈ టీజర్ మిస్ అయి ఉంటే మరోసారి ఈ వీడియోలో చూడొచ్చు.
కాగా.. రామ్ రెడ్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో గత ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఇప్పటి వరకూ ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో 10 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సూపర్ హిట్ తర్వాత రామ్ నుండి వస్తున్న చిత్రం కావడతో ‘రెడ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీలైనంత త్వరలోనే సినిమాని థియేటర్స్‌లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం.