ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో కలుపుకొని ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,339కి పెరిగింది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకూ 1,596 డిస్చార్జ్ కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 691 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులెటిన్లో పేర్కొన్నారు.
కొత్తగా నమోదైన 57 పాజిటివ్ కేసులో 6 కోయంబేడు మార్కెట్ నుండి వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. కరోనాతో కొత్తగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైరస్ వల్ల ఒక్కొక్కరు మరణించడంతో ఏపీలో మొత్తం మృతుల సంఖ్య 52కి పెరిగింది.