మార్కెట్లో పసిడి ధరల పరుగు కొనసాగుతోంది. కరోనాతో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్ని అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులవ్వటంతో పసిడి ధరలు అమాంత పెరిగాయి. అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, జపాన్ దేశాల బలహీన ఎకానమిక్ డేటా ఇవన్నీ కలిసి పసిడి ధరను భారీగా పెంచేశాయి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నిన్నటి బులియన్ ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,865కు చేరుకుంది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
* 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,408
* 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,510
ఇకపోతే వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర మూడు శాతం పెరిగి రూ.48,208లకు చేరుకుంది. ఈ పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే తులం బంగారం (10 గ్రాముల) ధర రూ. 50,000 చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.