ఎన్టీఆర్ బర్త్‌‌డేకి సర్‌ప్రైజ్ ఇస్తా..

రేపు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి సర్‌ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ పెద్ద షాక్‌నిస్తూ, లాక్‌డౌన్ వలన ఈ చిత్రానికి సంబంధించిన సర్‌ప్రైజ్‌లేవీ చేయలేకపోతున్నామని ప్రకటించిన సంగతి తెలిసినదే.

అయితే, ఎన్టీఆర్ అభిమానులు ఏమీ నిరాశపడనక్కర్లేదని, ఆయన బర్త్‌‌డే సందర్భంగా అభిమానులందరికీ ఓ సర్‌ప్రైజ్‌ను తన తరఫున ఇస్తానని ఎన్టీఆర్‌ పర్సనల్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ప్రకటించాడు. ఇవాళ తన ట్విట్టర్ ఖాతాలా ఆ సర్‌ప్రైజ్ రిలీజ్ చేస్తానని పేర్కొన్నాడు. దీంతో ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి తన బర్త్‌డే సందర్భంగా ఎలాంటి సర్‌ప్రైజ్ రాకపోవటంపై ఎన్టీఆర్ ఇప్పటికే తన అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. అభిమానులు నిరాశ పడొద్దని, ఒక చిన్న టీజర్‌ను లాంచ్ చేయాలంటే దాని వెనుక అనేక మంది టెక్నీషియన్ల పనిచేయాల్సి ఉంటుందని, లాక్‌డౌన్ ఆంక్షల వలన అది కుదర్లేదని వివరించారు.

ఆర్ఆర్ఆర్ చిత్రం తన కెరీర్ లోనే ఓ సంచలన చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం తనకుందని, తన పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు ఎలాంటి హడావుడి లేకుండా ప్రభుత్వ ఆంక్షలకు లోబడి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, ఇంటి పట్టునే ఉండాలని అభిమానులను కోరాడు తారక్.

ntr-3

https://platform.twitter.com/widgets.js

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s