ప్రపంచంలోనే అత్యధిక రోజులు లాక్డౌన్ ప్రకటించిన దేశం మనది, అయినా కరోనా కేసుల తగ్గుదలలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం దాదాపు రెండు నెలలుగా లాక్డౌన్ను పాటిస్తున్న కొత్త కేసులు మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.
తాజాగా.. భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష మార్కును దాటిపోయింది. కరోనాకు పుట్టినిళ్లయిన చైనాతో పోల్చుకుంటే మన దేశంలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 4,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇదే సమయంలో కొత్తగా 134 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా లెక్కలతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,01,139కి చేరింది. కాగా.. ఈ మహమ్మారి వల్ల ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,163 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్లో 58,802 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, ఇప్పటికే 39,173 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.